డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామానికి సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య ఆదివారం విజయం సాధించారు. సంకేపల్లిగూడ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మరి లావణ్య చెన్నయ్య 132 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
News
సంకేపల్లిగూడ సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య విజయం