| Daily భారత్
Logo




సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

News

Posted on 2026-07-26 16:55:36

Share: Share


సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన

డైలీ భారత్, కామారెడ్డి : ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సదాశివనగర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ మరియు ప్రజా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సుదర్శన్‌నగర్ సీఐ బి. సంతోష్ కుమార్ , సదాశివనగర్ ఎస్సై ఎం. పుష్పరాజ్  పాల్గొన్నారు.


కార్యక్రమంలో గ్రామానికి చెందిన వీపీఓ ఏఎస్ఐ జగదీష్ మరియు పీసీ రంజిత్ గ్రామ పరిస్థితులు, శాంతిభద్రతలు, ప్రజల సమస్యలు, పోలీసింగ్‌కు సంబంధించిన అంశాలపై డీఎస్పీ కి సమగ్ర వివరాలు అందించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో డీఎస్పీ  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులతో సమన్వయం కలిగి అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

అనంతరం సైబర్ వారియర్ పీసీ సంజయ్ ద్వారా సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.

అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బాధ్యత తీసుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

గ్రామాల్లో అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొంటూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >