| Daily భారత్
Logo




28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

News

Posted on 2026-07-26 16:51:12

Share: Share


28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుంపటి రాజు

డైలీ భారత్, కామారెడ్డి: ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ పిలుపు మేరకు, ఈ నెల 28వ తేదీ (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుంపటి రాజు జిల్లా లోని ఉప సర్పంచులందరికీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల ఉప సర్పంచులు తప్పనిసరిగా హాజరై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని కోరారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఉప సర్పంచుల సమస్యలు, డిమాండ్లను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.

వినతిపత్రంలో ప్రధానంగా ఈ డిమాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు: ఉప సర్పంచులకు నెలకు ₹5,000 గౌరవ వేతనం మంజూరు చేయాలి. ప్రభుత్వ అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను కూడా చేర్చాలి.గ్రామపంచాయతీ తీర్మానాలపై ఉప సర్పంచులు కూడా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలి.మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులను తప్పనిసరిగా ఆహ్వానించాల అనే డిమాండ్లతో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.కామారెడ్డి జిల్లాలోని ఉప సర్పంచులందరూ ఐక్యంగా పాల్గొని "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దుంపటి రాజు విజ్ఞప్తి చేశారు.

Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >
Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >