Posted on 2026-07-27 04:38:19
దళిత మహిళా జర్నలిస్టును దూషించినందుకు అట్రాసిటీ కేసు నమోదు
సిసిఎస్ ముసుగులో అవినీతి అక్రమాల దందాలు..?
అక్రమాలకు కొమ్ము కాస్తున్న పద్మా రెడ్డి పై విచారణ..?
కల్తీ పన్నీర్ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే దూషణాల దాడి .?
అక్రమ దందాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు
పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ప్రజల డిమాండ్
డైలీ భారత్, హైదరాబాద్:కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళా జర్నలిస్టును దూషించడం, బెదిరించడం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఎ.పద్మారెడ్డి పై "ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ" చట్టం కింద కేసు నమోదైనదని బాధితులు తెలిపారు. జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ లోని మురళీకృష్ణ పార్లర్ లో కల్తీ పన్నీరు విక్రయాల అంశాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా, ఆమెను లక్ష్యంగా చేసుకొని అత్యంత అసభ్య పదజాలాలతో దుర్భాషలాడటంతో పాటు రిపోర్టర్లను సైతం బెదిరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, అనేక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. కల్తీ పనీర్ విక్రయాలపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్టుపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, "రిపోర్టర్ల అంతు చూస్తా" "ముక్కు నేలకు రాయిస్తా" "పిచ్చకుంట్ల రిపోర్టర్లు" అంటూ హెచ్చరికలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇలా అధికార పార్టీ నాయకుల పేర్లు వినియోగిస్తూ స్థానికంగా సిసిఎస్(చర్లపల్లి కాలనీల సమైక్య) ని అడ్డుపెట్టుకొని అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఏ ఉద్యోగం చేయకుండా కేవలం సెటిల్మెంట్లే జీవనోపాధిగా చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారనే చర్చ ప్రజలలో కొనసాగుతోంది. వాస్తవానికి అక్రమాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం వసూళ్లే ద్యేయంగా పెట్టుకొని జీవించడం జరుగుతుందని, అయితే అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపైన బెదిరింపులకు పాల్పడుతూ వాస్తవాలను వెలుగులోకి తీసుకురాకుండా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడేటట్లు చేసిండన్న విమర్శలు ఏ. పద్మా రెడ్డి పై చాలా ఉన్నాయి. ఈ ఘటన జరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారం రోజులు అయిన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు నిన్న 25 తేదీ నాడు జర్నలిస్టు సంఘాల ఒత్తిడితో కేసు నమోదు అయ్యింది అంటే ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రభావం పోలీసు అధికారులపై ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
కుషాయిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని షెడ్లు, నిబంధనలకు విరుద్ధంగా బోరింగ్‌లు, ఇతర అక్రమ కార్యకలాపాలకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల్లో ప్రజాప్రతినిదుల పేరును ఉపయోగించి వసూళ్లు జరిగాయనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలిసి ప్రజాప్రతినిధులు కూడా మౌనంగా ఉండడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి. అధికారులు గతంలో జరిగిన విషయాలపై కూడా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఒక మహిళా జర్నలిస్టు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై దుర్భాషలు మాట్లాడటం, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను అవినీతి అక్రమాలు చేసేవాళ్లు అణిచివేసే ప్రయత్నాలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి.
ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు జరిగితే వాటిపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం రాజీపడకుండా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. సమాజంలో జరుగుతున్న అనేక అక్రమాలకు రాజకీయ అండ ఉందనే అనుమానాలు తొలగించాలంటే ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగి, బాధితురాలికి న్యాయం జరగడంతో పాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >