Posted on 2025-11-28 09:16:38
డైలీ భారత్ న్యూస్, కామారెడ్డి:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. కవిత, తెలంగాణ జాగృతి నాయకులు పట్టాలపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితను, పలువురు జాగృతి నేతలను అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో కవిత, జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైల్ రోకో నిర్వహించారు. రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కవితోపాటు జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కవిత, పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17శాతం రిజర్వేషన్లతోనే పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >