| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

డైలీ భారత్, సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావెలిన్ డే సందర్భంగా ఈరోజు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో గీతానగర్ జెడ్.పి.హెచ్.ఎస్. బాలికల పాఠశాల 6వ తరగతి "A" సెక్షన్ విద్యార్థిని బొల్లాజి సురక్ష తన ప్రతిభతో అందరి మన్ననలు పొంది.

ఆమె 60 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో సురక్ష 07-08-2026న హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్భంగా సురక్షను తరగతి ఉపాధ్యాయురాలు రేణుక మేడమ్, సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతి సార్ మరియు పి.ఈ.టి. సురేష్ సార్ అభినందించారు.

"జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణం. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా సురక్ష అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నాము" అని ఉపాధ్యాయులు అన్నారు.

సురక్ష విజయంతో గీతానగర్ పాఠశాల, సిరిసిల్ల జిల్లాకు మంచి పేరు వచ్చింది.


Previous కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Next జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
ADVERTISEMENT