| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

డైలీ భారత్, సిరిసిల్ల: హైకోర్టు న్యాయమూర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి. పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో జస్టిస్ తుకారాంజీకి పుష్పగుచ్ఛాలు అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

తదనంతరం సిరిసిల్లలో నిర్మాణంలో ఉన్న కోర్టు భవన నిర్మాణ పనులను జస్టిస్ ఎన్. తుకారాంజీ పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతపై సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి. లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి జి. మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

#RajannaSircilla #JusticeNTukaramji #HighCourt #CourtConstruction #GarimaAgrawal #SPMaheshBGithe #Judiciary #Sircilla #Telangana

Previous వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Next భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
ADVERTISEMENT