| Daily భారత్
Logo




ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ ప్రధానమంత్రికి ఇమెయిల్ ద్వారా వినతిపత్రం : టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

News

Posted on 2025-11-28 11:39:33

Share: Share


ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరుతూ  ప్రధానమంత్రికి ఇమెయిల్ ద్వారా వినతిపత్రం : టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు టిఎస్ యుటిఎఫ్ (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యములో  ప్రధాన మంత్రికి వినతిపత్రాలు ఇ మెయిల్ ద్వారా పంపారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పాస్ కావలనడం అన్యాయమని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా తీర్పుపై సమీక్షకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తామనే భరోసా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీటిఈ నోటిఫికేషన్ ప్రకారమే 2010 ఆగస్టు 23 కు ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని పేర్కొన్నందున గత 15 సంవత్సరాలుగా టెట్ వ్రాయాలనే ఆలోచన చేయలేదని, డిఎస్సీ పరీక్ష వ్రాసి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఇప్పుడు అర్హత పరీక్ష వ్రాయాలనడం హాస్యాస్పదమని  పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీనియర్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపునిస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  చట్టం చేయాలని, అందుకు పార్లమెంటు సభ్యులు అందరూ తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా పూర్వ అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, జిల్లా ప్రస్తుత అధ్యక్షులు పర్కాల రవీందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి రమేష్, జిల్లా కార్యదర్శులు ఎలగొండ రవి పాముల స్వామి లు పాల్గొన్నారు.


Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >