చింతకానిఎస్సై పై దాడి: లాఠీ చార్ట్
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం చింతకాని కరెంట్ షాక్ తో మృతి చెందిన రైల్వే కాలనీ కి చెందిన చెట్టుపోగు రంగయ్య (37) మృతదేహాన్ని పోస్టుమార్టం చేసుకొని తీసుకొస్తున్న మృతదేహాన్ని నాగులవంఛలో రైల్వే కాలనీ x రోడ్లో పెట్టి బాధిత షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు ధర్నాకు నిర్వహించడం జరిగింది సమయంలో ఖమ్మం to బోనకల్ రోడ్ భారీ గా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో చింతకాని ఎస్సై పై ఒకరు పిడిగుద్దులు గుద్దాడు మరికొందరు మిగిలిన పోలీసుల పై తిరగబడ్డారు. వైరా సీఐ, బోనకల్ ఎస్సై లు లాఠీ చార్ట్ చేయడంతో ఆందోళన విరమించి రంగయ్య మృతదేహాన్ని రైల్వే కాలనీ కి తీసుకెళ్లి రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పై పోలీసు కమిషనర్ ఆందోళన కారులపై కేసు నమోదు కు ఆదేశించినట్లు తెలిసింది.