| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ బిరుదురోహిత్ రాజు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ బిరుదురోహిత్ రాజు

డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.జిల్లా వ్యాప్తంగా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,06 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలు,06 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను,04 అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు మండల గ్రామాల్లోగ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎఫ్‌ఎస్‌టి (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్),ఎస్‌ఎస్‌టి (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్),చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.డ్యూటీ పాస్‌పోర్ట్ అందుకున్న వెంటనే,ఎఫ్‌ఎస్‌టి,ఎస్‌ఎస్‌టి సిబ్బంది సంబంధిత ఇన్‌చార్జ్ అధికారిని సంప్రదించి,వారి మొబైల్ నంబర్‌ను తీసుకొని వారితో సమన్వయం  పాటించాలనిసూచించారు. తప్పనిసరిగా మండల ప్రధాన కార్యాలయంలోనేఉండాలని,రిలీవర్ వచ్చే వరకు డ్యూటీ స్థలాన్ని విడిచి వెళ్లకూడదని తెలిపారు.తనిఖీ సమయంలో ప్రతివాహనాన్నిసమయం,వాహనం నంబర్,ప్రయాణ ఉద్దేశం మరియు తీసుకున్న చర్యతో సహా రిజిస్టర్‌లో సరిగ్గా నమోదు చేయాలని అన్నారు.ఏదైనా నగదు, మద్యం,బహుమతులు, బంగారం లేదా అనుమానాస్పద వస్తువులు దొరికితే వాటికి కాపలాగా ఉండి ఇన్‌చార్జ్ బృందానికి సహాయం చేస్తూ వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఎస్కార్ట్ చేసి,ఎటువంటి ఆలస్యం లేకుండా ఎస్‌హెచ్‌ఓ/సిఐ/డిఎస్‌పికి తెలియజేయాలని తెలిపారు.తనిఖీ మరియు స్వాధీనం చేసే సమయంలో మొబైల్ వీడియో రికార్డింగ్ ఉండేలాచూసుకోవాలన్నారు.తద్వారా పారదర్శకతను నిర్ధారించి,ఆరోపణలను నివారించవచ్చని తెలియజేశారు.ఎలాంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసుకోవాలన్నారు. అలా కనిపిస్తే ఇన్‌చార్జ్ సూచనల మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల తనిఖీ సమయంలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అన్ని విభాగాల అధికారులతో సమన్వయం పాటిస్తూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు,సిబ్బంది భాద్యతగా విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ తెలియజేసిన వారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous రాజన్న సిరిసిల్ల : మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య దారుణ హత్య
Next ఎలక్ట్రిషన్ మృతదేహంతో ఆందోళన
ADVERTISEMENT