| Daily భారత్
Logo




మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

News

Posted on 2025-11-18 13:59:59

Share: Share


మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

వారి సేవలు ఎందరికో స్ఫూర్తి

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకల్లో నూడా ఛైర్మన్ కేశవేణు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా ఛైర్మన్ కేశవేణు, యూవి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్, గైని గంగారాం, సుజాత సుర్యరాజ్, లక్కంపల్లి సంజీవరావు వాల బాలకిషన్ పాల్గోని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూడా ఛైర్మన్ కేశవేణు మాట్లాడుతూ 

నిరంతర నిర్విరామ నిస్వార్థ నిష్కలంక సేవలతో సమాజాన్ని జాగృతం చేస్తున్న ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు సారథ్యం వారి సేవలు నిరూపమానమని  అన్నారు  అలాగే ఇందూరు యువత మెదలైన సందర్భంలో మెదటి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బ  ప్రస్థానాన్ని దగ్గర నుంచి చూసానని అప్పటినుండి ఇప్పటిదాకా నిరంతరంగా నిరుపమానంగా సాగుతున్న ఇందూరు యువత సేవలు అనన్యం అసామాన్యం అని 14 సంవత్సరాలుగా నిత్యం ఆకలి గున్న కడుపులకి అన్నాన్ని అందిస్తూ ఆకలిని తీర్చడం అనితర సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు గైని గంగారం మాట్లాడుతూ ఇందూరు యువత సేవా ప్రస్థానంలో 14 ఏండ్లుగా తాను భాగస్వామినై ఉండటం ఆనందంగా ఉందన్నారు. విరి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అలాగే యూవి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్ మాట్లాడుతూ ఇందూరు యువత చేసే సేవల్లో అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేయడం సాయి బాబు హృదయ సంస్కారానికి గొప్ప గుర్తింపు అన్నారు. ఎవరు పట్టించుకోకుండా దీనావస్థలో ఎక్కడో పడి ఉండి సమాజం చీదరించుకుంటున్నటువంటి అభాగ్యులు ఎవరికి తెలియకుండా మరణించినప్పుడు వారి మృతదేహాలను దూరం నుంచి కూడా చూడ్డానికి ఇష్టపడని సమాజం అలాంటి సందర్భాలలో  అనాధ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం అనన్య సామాన్యమన్నారు. అంతే కాకుండా చనిపోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ కాశీలో వారికి పిండ ప్రదానం చేయడం వారికి తలనీలాలు సమర్పించుకోవడం ఒక కొడుకు తన బాధ్యతను సాయిబాబు, అతని మిత్రులు చేయడం అనేది ఎవరికి సాధ్యం కానీ సేవలని అన్నారు ఇలాంటి కార్యక్రమాలకి తనవంతు సహకారం అందింస్తాన్నారు. ఈ సందర్భంగా ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ తాను చనిపోయేంతవరకు ఈ సేవలను ఇలాగే ఇంకా ఉధృతంగా కొనసాగిస్తానన్నారు ఒకవేళ తాను ఈ సేవా మార్గంలో ఎప్పుడైనా మరణిస్తే తనమీద జాతీయ జెండాను కప్పాలని ఉద్విగ్నంగా కోరారు. దీనికి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా  అందరూ లేచి నిలబడి సైన్యాభినందించారు ఆయన మాట్లాడుతున్నంతసేపు ప్రతి ఒక్కరు కన్నిరును కార్చారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అలాగే లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ద్వారా సేవా కార్యక్రమాలు కోనసాగించేలా జి.ఆర్ సుజాత సుర్యరాజ్ ఆర్థిక సహకారం అందజేశారు.

వివిధ పాఠశాలలైన  విశ్వవికాస్ హైస్కూల్,కిట్స్ ఫ్యూచర్ స్కూల్, హోలిమేరి హైస్కూల్ , శ్రీ నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు మద్ది గంగాధర్, చందా జగన్ మోహన్, దర్శనం రాజు, డా.కాసర్ల నరేష్ రావ్, రాజేష్ శర్మ, సూజాత రెడ్డి, పుష్పవతి, బోడ హన్మండ్లు, రాజు, శ్రీలత మరియు ఎస్.ఎస్.ఆర్ జూనియర్ కాలేజ్, యూ.వి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, సత్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్దులు అధ్యాపకులు తదితరులు పాల్గోన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >