| Daily భారత్
Logo




టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తం చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

News

Posted on 2025-11-10 18:03:17

Share: Share


టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తం చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

"మోదీ గిఫ్ట్’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఫీజు చెల్లిస్తానని ఇటీవల కలెక్టర్లకు లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

తన వేతనం నుండి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే 12 వేల మంది విద్యార్థులకు ఫీజు చెల్లించిన బండి సంజయ్.

ఆ మొత్తాన్ని చెక్ రూపంలో కలెక్టర్లకు అందజేసిన బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల నేతలు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  సోమవారం రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,363, సిరిసిల్ల జిల్లాలో 3948, సిద్దిపేట జిల్లాలో 1013, జగిత్యాల జిల్లాలో 1434, హన్మకొండ జిల్లాలో 690 మంది విద్యార్థులున్నారు. వీరందరి పక్షాన  పరీక్ష ఫీజు మొత్తాన్ని బండి సంజయ్ చెల్లించారు. కేంద్ర మంత్రి తరపున కరీంనగర్ జిల్లాలో చదివే విద్యార్ధలు పరీక్ష ఫీజు మొత్తాన్ని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి చెక్ రూపంలో అందజేశారు.  అట్లాగే సిరిసిల్ల జిల్లా నేతలు గరీమా అగర్వాల్ ను కలిసి చెక్ అందజేశారు. సిద్దిపేట జిల్లా విద్యార్థుల పక్షాన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జగిత్యాల, హనుమకొండ జిల్లాల విద్యార్థుల పక్షాన ఆయా జిల్లాల బీజేపీ నేతలు ఆయా కలెక్టర్లను కూలిసి పరీక్ష ఫీజు మొత్తాన్ని చెక్ రూపంలో అందజేయడం గమనార్హం.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే కావడం,  వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష ఫీజు కూడా చెల్లించలేకపోతున్నారని తెలుసుకున్న బండి సంజయ్ ఈ మేరకు తన వేతనం నుండి ఆ మొత్తాన్ని చెల్లిస్తానని ఇటీవల ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. అనుకున్నట్లుగా ఆ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు.  అతి త్వరలోనే ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు  సైతం సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అట్లాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ‘మోదీ కిట్స్’ పేరుతో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >