| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

19వ డివిజన్ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ

19వ డివిజన్ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండగ

హాజరైన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని 19 వ డివిజన్ కంటేశ్వర్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  అమ్మవారి బోనాల పండుగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. డివిజన్‌లో ని భక్తులు, ముఖ్యంగా మహిళ భక్తులు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై  భక్తిపూర్వకంగా బోనం ఎత్తుకొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి బోనాలు తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రజల ఐకమత్యం, భక్తి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగలను మనందరం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ,” అని తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు  బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతమంతా భక్తి సందడితో నిండింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నాగోల్ల రవి, కంటేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయి ప్రవీణ్, ఎల్లమ్మ తల్లి మండల ప్రధాన కార్యదర్శి బెండ ప్రసాద్, బిజెపి నాయకులు గుండు రవి, సాయిరాం, సాయిలు  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం : ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి
Next నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో పథ సంచలన్ ఘనంగా నిర్వహణ
ADVERTISEMENT