Posted on 2026-05-25 17:55:57
కేటీపీఎస్ కొత్త ప్లాంట్లు
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్
ఆసుపత్రి అప్‌గ్రేడ్
జర్నలిస్టులకు ఇళ్లు డిమాండ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి, ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేటీపీఎస్ పాత ఎ, బి, సి స్టేషన్ల స్థానంలో కొత్తగా 2/800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ భవనాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
కొత్తగూడెం మున్సిపాలిటీని “కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్”గా అప్‌గ్రేడ్ చేయాలని, కిన్నెరసాని ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. హరిత రిసార్ట్, బడ్జెట్ హోటల్ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తక్షణ నిధులు కేటాయించాలని సీఎంకు వివరించారు.
ముర్రేడు వాగు రక్షణ గోడ నిర్మాణానికి రూ.50.50 కోట్లు మంజూరు చేయాలని, సింగభూపాలెం, చింతల చెరువుల ఆధునీకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపిణీ కాలువల డిజైన్ మార్పు, పొడిగింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు.
విద్యా, క్రీడా రంగ అభివృద్ధిలో భాగంగా 20 ఎకరాల్లో సమగ్ర క్రీడా స్టేడియం ఏర్పాటు చేయాలని, మహిళల రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పనులకు రూ.1160 లక్షలు, గిరిజన మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాల పునర్నిర్మాణానికి రూ.25 కోట్లు, సుజాతనగర్ జూనియర్ కళాశాల, కొత్త ఐటీఐలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వైద్య సేవల విస్తరణలో భాగంగా పాల్వంచ సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కాత్‌ల్యాబ్, ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తెలిపారు.
జీవో నెంబర్ 76 కింద ఇళ్ల క్రమబద్ధీకరణ, పెండింగ్ పోడు భూముల పట్టాల సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ స్థలం గుర్తించాలని, పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మైలారం రాగి గని పునఃప్రారంభం, పాండురంగాపురం–భద్రాచలం రైల్వే లైన్ సాధన, డీఎంఎఫ్‌టీ నిధుల విడుదల అత్యవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు, వంతెనల నిర్మాణంతో పాటు ఎంఆర్ఓ, జెడ్పీ, ఎంపీడీఓ శాశ్వత కార్యాలయ భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు.
చివరగా కొత్తగూడెం, పాల్వంచ ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కూనంనేని తెలిపారు. తాము సమర్పించిన వినతిపత్రంలోని అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >