Posted on 2026-07-27 14:24:02
డైలీ భారత్, రేగళ్ల: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు.
ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
తనిఖీలో భాగంగా ఓపీ నమోదు, రోజువారీ రోగుల సంఖ్య, గత పది రోజుల జ్వర కేసుల వివరాలను సమీక్షించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. జ్వర లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి వెంటనే చికిత్స అందించాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
రక్త పరీక్షల విభాగాన్ని పరిశీలించి మలేరియా, డెంగ్యూ, హెచ్‌ఐవీ పరీక్షల కోసం అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, ప్రయోగశాల సామగ్రిని సమీక్షించారు. ఎలాంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు.
అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వలు, గడువు తేదీలు, అవసరమైన ఔషధాల లభ్యతను పరిశీలించి, మందుల కొరత తలెత్తకుండా ముందుగానే ఇండెంట్లు పంపించి నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పాము కాటుకు వినియోగించే యాంటీ స్నేక్ వెనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా అని కూడా పరిశీలించారు.
ఆయుష్ క్లినిక్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు, ఆయుష్ ఔషధాల లభ్యతను పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను కూడా సమర్థవంతంగా అందించాలని సూచించారు.
తనిఖీ అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా సకాలంలో వైద్య సేవలు, అవసరమైన మందులు, పరీక్షా సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
పాల్గొన్నవారు: లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు.
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >