| Daily భారత్
Logo




ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

News

Posted on 2026-07-27 06:58:57

Share: Share


ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.           

డైలీ భారత్, ఖమ్మం: ప్రజా సమస్యను గాలికి వదిలేసిన మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో సునామీల దూసుకొస్తుంది జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతర పోరాటం చేస్తాం ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన ఎదుగుతుంది ప్రజా కే ప్రజల కేంద్రంగా పరిపాలన జరగాలని నినాదం జనసేన లక్ష్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారం లో విఫలం.  జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం ఎల్ వలినో ప్రభావంతో వర్షాలు లేక రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మరల ప్రభుత్వం విఫలం. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ వైద్య ఆరోగ్యశాఖ మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు  జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.                       

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ప్రతిష్టత కోసం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేసి జనసేన పార్టీ సత్తా చాటుతామన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాల్లో జనసేన గెలవబోతుందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీల మేనిఫెస్టో విడుదల చేసి 400 హామీలు ఇచ్చిందని 20% హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పాలన రెండున్నర సంవత్సరాల పూర్తయిందని రైతు సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు.  పకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళిక సమీక్ష నిర్వహిస్తాయని ఎల్ లినో ప్రకృతి సమస్యను అంచనా వేసి రైతులను ప్రధానమైన పంటల వైపు నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంతమంది రైతులకు యూరియా యాప్  అవగాహన ఉందని మూడు నిమిషాల్లోనే యాప్ క్లోజ్ అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బారాస కాంగ్రెస్కు బీ టీమ్ల వ్యవహరిస్తుందని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కుమ్ములాడుకుంటున్నారు విమర్శించారు.  భద్రాద్రి జిల్లా లో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉందని ఏజెన్సీలో ఆదివాసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మలేరియా నివారణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫాగింగ్ స్ప్రేయింగ్ దోమతెరలు ఆదివాసి ప్రజలకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ఆ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సి వస్తుందని అన్నారు.  రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని అశ్వాపురంలో ఆదివాసీలు పొట్టకూటు కోసం సాగు చేస్తున్న భూమిలో సాగిస్తున్న పోడు భూములు మహిళలపై దాడులు చేసి ఆదివాసీల ఆదివాసి గిరిజన మహిళలపై దాడులను ఖండిస్తున్నామని, అమాయక ప్రజలు సాగు చేసుకుంటా ఉంటే ఏం దోచుకున్నారని దాడులు చేస్తారని విమర్శించారు ఆదివాసి గిరిజనులు సాగు చేసుకుంటే తప్ప పొట్టకూటి కోసం సాగు చేసేరా తప్ప ఎవరిని దోచుకోలేదే అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  యువత మహిళలు నిరుద్యోగులు సమస్యలు పట్టించుకోలే పట్టించుకోవడంలేదని సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కుతున్నారన్నారు.  ప్రతివారం జిల్లాకు ముగ్గురు మంత్రులు వస్తున్నారని సమస్యల పరిష్కారంలో మాత్రం చరవడం లేదని విమర్శలు చేశారు.  జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు.  కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వానికి సహకరిస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారానికి ఉద్యమ పార్టీ నేతగా పోరాటాలు చేయడం లేదన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యువతకు ఉపాధి కల్పన కోసం కొత్తగా పరిశ్రమలు తీసుకురాలేదని ఉన్న పరిశ్రమలే నిర్లక్ష్యానికి గురవుతుందని విమర్శించారు కేటీపీఎస్ రెండో దశ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కష్టాలను సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుడ్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్స్ పాలసీ జనసేన పార్టీ విధానమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అందిస్తున్న సేవలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయని గుడ్ గవర్నెన్స్ కి ఉదాహరణ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యను ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటలో  ఆగస్టు 2(ఆదివారం ) న నిర్వహించే జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దమ్మపేటలో నిర్వహించే కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు రాము యాదవ్ , ఖమ్మం జిల్లా  ఇంచార్జ్ ఉ మిరియాల రామకృష్ణ, జనసేన జిల్లా నాయకులు సాదిక్, జనసేన వీర మహిళ దివ్య,సోజన్య ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ చండ్రుగొండ మండల అధ్యక్షుడు వేణు దమ్మపేట మండల అధ్యక్షుడు రహీం జూలూరుపాడు మండల అధ్యక్షుడు ఉషికల రమేష్ పాల్గొన్నారు.

Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >