| Daily భారత్
Logo




అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

News

Posted on 2026-07-28 08:04:20

Share: Share


అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

సాంకేతిక పరిజ్ఞానంతో లొకేషన్ ట్రేస్ చేసి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసు సిబ్బంది

విధి నిర్వహణలో అప్రమత్తత కనబరిచిన రాజాపూర్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

డైలీ భారత్, రాజాపూర్: రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజులాగే సోమవారం అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్ సిబ్బంది అప్రమత్తతతో ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.

27/28-07-2026 మధ్యరాత్రి సుమారు 1.00 గంటల సమయంలో రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన టంకరి రాజేష్ తండ్రి యాదయ్య కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయి తన భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య తన ఇద్దరు చిన్న పిల్లలతో కంగారుగా వెతుకుతుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పీసీ-1170 సత్యనారాయణ గౌడ్ ఆమెను గమనించి వివరాలు తెలుసుకున్నారు.

వెంటనే ఆమె వద్ద నుంచి రాజేష్ మొబైల్ నంబర్ సేకరించి రాజాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారికి తెలుపగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అతని లొకేషన్‌ను గుర్తించారు. అనంతరం పెట్రోలింగ్ సిబ్బంది అయిన పీసీ-1170 సత్యనారాయణ గౌడ్, హోంగార్డ్-639 ఖాజా ఖలీముద్దీన్ మరియు పెట్రోల్ మొబైల్ హోంగార్డ్-665 డ్రైవర్ నరేందర్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రాజేష్‌ను సురక్షితంగా కాపాడి, కౌన్సెలింగ్ అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సమయస్ఫూర్తితో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అభినందిస్తూ, ఇలాంటి మానవతా దృక్పథంతో విధులు నిర్వహించడం పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత ఒత్తిళ్లు జీవితానికి ముగింపు కావు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్య అనేది శాశ్వత పరిష్కారం కాదు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించండి. సమయానికి తీసుకున్న ఒక నిర్ణయం విలువైన ప్రాణాలను కాపాడుతుంది.

#MahabubnagarPolice

Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >