| Daily భారత్
Logo




మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

News

Posted on 2026-07-28 02:27:11

Share: Share


మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

డైలీ భారత్ డెస్క్: సుప్రీంకోర్టు పునరుద్ఘాటన మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మత మార్పిడికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల హోదాపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదాను కొనసాగించలేరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ అంశంపై మార్చి 2026లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలను లేదా సర్టిఫికేట్‌ను పొందడం చెల్లదని, మత మార్పిడితో ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉందంటూ, రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది.ఇతర మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, అయితే, క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే.. కొన్ని నిర్దిష్ట షరతుల మేరకు ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్సీ హోదా పునరుద్ధరణకు 3 కీలర షరతులు తప్పనిసరి అని పేర్కొంది. ఆ వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలని, తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో స్వీకరించి ఉండాలని, సంబంధిత అసలు కులం ఆ వ్యక్తిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను పునరుద్ధరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >