| Daily భారత్
Logo




కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

News

Posted on 2026-07-27 06:48:26

Share: Share


కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

మల్లన్న భక్తులు రెడీ అయిపోండి!

డైలీ భారత్,కొమురవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త. కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లోని నూతన రైల్వేస్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నేడు ప్రారంభించారు. కొమురవెల్లి మల్లన్న భక్తుల సౌకర్యార్థం 5.63 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు.

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు

కొమురవెల్లి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ ను నేడు కేంద్రమంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రైల్వేస్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

భక్తుల ఇబ్బందులకు చెక్

హైదరాబాద్ నుండి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వస్తున్న భక్తులు బస్సులు, వాహనాలలో వస్తూ ఇబ్బంది పడుతున్నారని, రైల్వే స్టేషన్ ప్రారంభంతో ఆ ఇబ్బందులు తొలగిపోయినట్టే అని తెలిపారు. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి రావడానికి ప్రజలు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ ప్రాంతాల వారికి మెరుగైన రైలు సౌకర్యం

కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్ తో చేర్యాల, మద్దూరు, నర్మెట్ట మండలాల ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులకు, చిరు వ్యాపారులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చే వారికి రైలు ప్రయాణంతో సగానికి సగం ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమూ రైళ్లకు హాల్ట్

కొత్తగా ప్రారంభమైన కొమురవెల్లి స్టేషన్లో హై లెవెల్ ప్యాసింజర్ ప్లాట్ఫారం 400 మీటర్లు, విశ్రాంతి హాల్, టికెట్ కౌంటర్, తాగునీరు, విద్యుదీకరణ, స్థానిక సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఇక సికింద్రాబాద్ సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమూ రైళ్లకు కూడా ఈ స్టేషన్లో హాల్ట్ కల్పించారు. సిద్దిపేట నుండి వచ్చే రైలు మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు, ఉదయం 6 గంటల 45 నిమిషాలకు, సికింద్రాబాద్ నుండి వెళ్లే రైళ్లు మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాలకు, రాత్రి 8 గంటల 04 నిమిషాలకు అక్కడ ఆగుతాయి.

Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >