Posted on 2026-07-27 14:06:55
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, వైరా: జూలూరుపాడు మండల కేంద్రంలోని అనంతరం గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యదలపల్లి వీరభద్రం నివాసంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో రూ.13,000 కోట్ల వ్యయంతో సీతారామ ప్రాజెక్టును చేపట్టారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు రూపురేఖలను మార్చి, జూలూరుపాడు నుంచి ఏన్కూర్ సాగర్ కాలువలోకి అనుసంధానం చేసి నీటిని ఆంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
జూలూరుపాడు, ఏన్కూర్, కారేపల్లి, వైరా, కొణిజర్ల ప్రాంతాలకు సాగునీరు అందకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చెరువులు, కుంటలు నింపుతామని ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు.
వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలో సుమారు 25 వేల ఎకరాల సాగుభూమికి నీరు అందక, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు యూరియా కొరత కూడా రైతులను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి రైతు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రైతుల హక్కులను కాపాడేందుకు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని గిరిబాబు హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాపలమడుగు రామ్మూర్తి,యదలపల్లి వీరభద్రం, తాళ్లూరి రామారావు, పోతురాజు రామారావు, బండారి వెంకయ్య మరియు తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >