| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

ట్రాక్టర్ నడుపుతూ యాతాలకుంట టన్నెల్ పనులు పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్ల కృషి అభినందనీయం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులను రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ TSతో కలిసి మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్‌లు, ప్రధాన కాలువలు, టన్నెల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. మొత్తం సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రస్తుతం టన్నెల్ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, ఈ వర్షాకాలంలోనే సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అదేవిధంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు మరియు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేశారని మంత్రి అభినందించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు నిర్వహించారని తెలిపారు.

ప్రాజెక్టు మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.


#SitaramaProject #GodavariWater #Irrigation #Agriculture #TelanganaFarmers #BhadradriKothagudem #Khammam #PrajaPalana #Telangana

Previous మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్
Next కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం
ADVERTISEMENT