Posted on 2025-11-09 20:23:43
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలలో భాగంగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక అతిథిగా పాల్గొని, స్వయంసేవకులతో కలిసి పట్టణంలోని పలు కాలనీల గుండా సాగిన పథ సంచలన్‌లో నడిచి, దేశభక్తి నినాదాలతో ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర ఎంతో కీలకం. ప్రతి విపత్తు సమయంలో — సహజమైనా, సామాజికమైనా — స్వయంసేవకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కృతిక విలువల పరిరక్షణలో ఆర్ ఎస్ ఎస్ అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తోంది,” అని అన్నారు.
పథ సంచలన్‌లో పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు పట్టణ వీధుల్లో క్రమశిక్షణతో ప్రదర్శన నిర్వహించారు. దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఇందూర్ నగర స్వయంసేవకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >