Posted on 2026-05-26 07:13:36
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులు, గోదాంలకు తరలించి అన్ లోడింగ్ వేగవంతం చేసి నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ, మిల్లులో అన్ లోడింగ్ పై కలెక్టర్ ఆరా తీశారు. మిల్లుల వారీగా ఎంతవరకు ధాన్యం అన్ లోడింగ్ చేశారో వివరాలు అడిగి, హమాలీల సంఖ్య పెంచుకునేలా యజమానులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. లక్ష్యానికి మేరకు రోజూ వారీగా కొనుగోళ్ళ శాతం క్రమంగా పెరిగేలా చూడాలని ఆదేశించారు.
వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టార్పాలిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాల్లో చేస్తున్న ట్యాబ్ ఎంట్రీ, తదితర వివరాలు ఆరా తీశారు.
కొనుగోళ్ళు పూర్తయిన కేంద్రాల నుండి హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు.
రోజూ వారీగా కొనుగోళ్ళ శాతం పెంచి, సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్ళు సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. తూకం వేసి ఉన్న ధాన్యం బస్తాలను తరలించేందుకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
#Sircilla #sircillacollector #garimaagrawal #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >