డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పట్టణం నకు చెందిన నిందితుడు బత్తుల చంద్రశేఖర్ కు మైనర్ బాలిక పై లైంగిక దాడి చేసిన కేసు లో జీవిత కాలం జైలు శిక్ష తో పాటు ఒక లక్ష ల రూపాయి ల జరిమాన విధిస్తూ ఖమ్మం జిల్లా ఫోక్స్1 ఇన్ ఛార్జ్ న్యాయాధికారి మొదటి అధనపు జిల్లా న్యాయాధికారి బి. శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 6 మే2024 నాడు మైనర్ బాలిక కు మాయమాటలు చెప్పి నిందితుడు మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడాడని 6 మే 2024 న ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కేసు ను విచారించి కోర్టులోచార్జెషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయాధికారి నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి లైజన్ ఆపీసర్ శ్రీనివాస్ హోమ్ గార్డు చిట్టిబాబు లు సహకరించారు.