అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన కేతవరపు రామకృష్ణ నివాసం..
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులు.
డైలీ భారత్, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భగవాన్ దాస్ కాలనీలో శుక్రవారం కేతవరపు రామకృష్ణ, శ్రీదేవి దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, దీపారాధనలు, భజనలు, శరణుఘోషలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
గురుస్వాముల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకకు అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి సేవలో పాల్గొన్నారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేతవరపు రామకృష్ణ, శ్రీదేవి దంపతులు భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.