డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద లక్షలు పెట్టి నిర్మించిన బతుకమ్మ తెప్ప నేడు క్రీడా మైదానంగా మారింది!
గతంలో ఆహ్లాదం! ఇప్పుడు నిరాదరణ!
గత ప్రభుత్వంలో పట్టణ ప్రజలకి ఆహ్లాదం కొరకు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు! కానీ కాలక్రమేణ ఇప్పుడు ఇది నిరాదరణకి గురైంది!
ప్రతి ఆదివారం సాయంత్రం పట్టణ ప్రజలు ఆహ్లాదం కోసం బతుకమ్మ ఘాట్ కి కుటుంబ సభ్యులతో వచ్చి కాసేపైనా సేద తీరేవారు! ఇప్పుడు ఫౌంటెన్ ను పట్టించుకునే నాథుడే లేడు!
పిల్లల ఆట మైదానంగా ఫౌంటెన్!
ఇప్పుడు ఫౌంటెన్ పిల్లలకి క్రీడా మైదానంగా మారింది! ఫౌంటెన్ పనిచేయకపోవడంతో పిల్లలు దానిపైనే ఆటలు ఆడుతూ కాలం గడుపుతున్నారు!
ప్రజల డిమాండ్!
ఇప్పటికైనా మున్సిపాలిటీ వారు ఫౌంటెన్ మళ్ళీ పనిచేసే విధంగా చేసి, బతుకమ్మ ఘాట్ ప్రాంతంలో శుభ్రత పాటించాలని ప్రజలు కోరుతున్నారు!
#DailyBharath #Sircilla #BathukammaGhat #Municipality #Telangana