డైలీ భారత్, వికారాబాద్: శీతాకాలంలో తెల్లవారుజామున పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందని, అందుకే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు!
పాటించాల్సిన జాగ్రత్తలు:
ఈ సందర్భంగా ఆమె వాహనదారులకు పలు భద్రతా సూచనలు చేశారు!
- వాహన వేగాన్ని తగ్గించి నడపాలి!
హెడ్ లైట్లు మరియు ఫాగ్ లైట్లు వాడాలి!
ముందు వెళ్లే వాహనాలకు సురక్షిత దూరం పాటించాలి!
అనవసర ఓవర్ టేకింగ్ చేయవద్దు!
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి!
కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి!
ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం:
ప్రజల ప్రాణాలను రక్షించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు! ట్రాఫిక్ నిబంధనలు పాటించి, బాధ్యతగా ప్రయాణించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు!
#DailyBharath #VikarabadPolice #RoadSafety #FogAlert #DriveSafeStaySafe