| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అప్రమత్తత, అవగాహనతోనే నషా ముక్త్ భారత్ సాధ్యం! డ్రగ్స్ మాఫియాపై కీర్తిరెడ్డి ఫైర్!

అప్రమత్తత, అవగాహనతోనే నషా ముక్త్ భారత్ సాధ్యం! డ్రగ్స్ మాఫియాపై కీర్తిరెడ్డి ఫైర్!

డైలీ భారత్, హైదరాబాద్: భావి భారతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి అన్నారు! డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే ప్రజల్లో అప్రమత్తత, అవగాహన పెరగడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు!

శనివారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో నిర్వహించిన సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా - హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ మెగా అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు! ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు! పలువురు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు!

ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ప్రపంచ స్థాయిలో తనదైన గుర్తింపు సాధిస్తోందన్నారు! అయితే దేశ యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మత్తుకు బానిసలుగా మార్చే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు! యువత దేశానికి తరగని ఆస్తి అని, వారి శక్తిసామర్థ్యాలు దేశ ప్రగతికి ఉపయోగపడాల్సిన అవసరం ఉందని అన్నారు!

యువతే లక్ష్యం... అప్రమత్తంగా ఉండాలి:

హర్యానా, ఉత్తరప్రదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, హైదరాబాద్ లోని బస్తీల నుంచి ఐటీ కారిడార్ల వరకు మత్తు పదార్థాల ప్రభావం విస్తరిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు! డ్రగ్స్ సరఫరా, వినియోగంపై సమాజం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు! యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు కుటుంబాలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని అన్నారు!

నషా ముక్త్ భారత్ సాధనే లక్ష్యం:

నక్సలిజం నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మాదిరిగానే డ్రగ్స్ రహిత భారత నిర్మాణం కోసం కూడా సమష్టి కృషి అవసరమని కీర్తిరెడ్డి అన్నారు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న నషా ముక్త్ భారత్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు!

కలిసికట్టుగా...

యువత మత్తు పదార్థాలకు బానిసలై నేర ప్రవృత్తి వైపు మళ్లకముందే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు అప్రమత్తం కావాలని సూచించారు! యువతలో సరైన ఆలోచనా ధోరణి, సామాజిక బాధ్యత, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు!

ర్యాలీని విజయవంతం చేయాలి:

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని కీర్తిరెడ్డి స్పష్టం చేశారు! ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు! ఈ నెల 25, 26, 27 తేదీల్లో అంబర్ పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు నిర్వహించనున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ ర్యాలీలో ప్రజలు, యువత, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు!

#DailyBharath #NashaMuktBharat #DrugsFreeIndia #HyderabadWalks #KeerthiReddy #KishanReddy #BJP #Hyderabad #Youth

Previous ఏసీబీ వలలో పంచాయత్ సెక్రటరీ!
Next ఢిల్లీలో గోదారా గ్యాంగ్ కు షాక్... బయటపడిన అమెరికా నుంచి నడుస్తున్న ఎక్స్టార్షన్ రాకెట్
ADVERTISEMENT