| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో భయానక ప్రమాదం! ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు! గడ్డపారతో తలుపులు తొలగించి డ్రైవర్ ను బయటకు తీశారు!

సిరిసిల్లలో భయానక ప్రమాదం! ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు! గడ్డపారతో తలుపులు తొలగించి డ్రైవర్ ను బయటకు తీశారు!

ఆర్టీసీ బస్సు - కారు ఢీ! పలువురికి గాయాలు! డ్రైవర్ ను బయటకు తీసిన 108 సిబ్బంది!

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది!

పొగమంచే కారణమా?

కోనరావుపేట వెళ్లే రహదారిపై సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 02 Z 0202) కారు బలంగా ఢీకొన్నాయి! ఉదయం వేళ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు!

కారు నుజ్జునుజ్జు! బస్సు టైరు ధ్వంసం!

కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు ముందు టైరు పూర్తిగా ధ్వంసమైంది! కారు ముందు భాగం సైతం నుజ్జునుజ్జయింది!

కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో కారులోంచి బయటకు పడి అపస్మారక స్థితికి చేరుకోగా, డ్రైవర్ సీట్లోనే ఇరుక్కుపోయాడు!

గడ్డపారతో రక్షణ!

సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు! నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను 108 సిబ్బంది స్థానికుల సాయంతో గడ్డపారతో కారు భాగాలను తొలగించి అతికష్టం మీద బయటకు తీశారు!

తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు క్షతగాత్రులను తక్షణమే 108 అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు!

బస్సు ప్రయాణికులు సురక్షితం!

తాటిపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఉండగా, అందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు! ఒక్కసారిగా భారీ శబ్దంతో ప్రమాదం జరగడంతో బస్సులోని మహిళా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు!

#DailyBharath #Sircilla #RoadAccident #RTCBus #FogAlert #Telangana

Previous పొగమంచు సమయంలో అప్రమత్తంగా ఉండండి! రోడ్డు ప్రమాదాలను నివారించండి! వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచన!
Next లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారిణి! అధికారులను చూసి డ్రైనేజీలోకి విసిరేసిన నోట్ల కట్టలు!
ADVERTISEMENT