| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారిణి! అధికారులను చూసి డ్రైనేజీలోకి విసిరేసిన నోట్ల కట్టలు!

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారిణి! అధికారులను చూసి డ్రైనేజీలోకి విసిరేసిన నోట్ల కట్టలు!

డైలీ భారత్, కాంకేర్: అవినీతిపై ఛత్తీస్ గఢ్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ మరోసారి కొరడా ఝుళిపించింది! కాంకేర్ జిల్లాలో స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆంచలా గిరి రూ. 1,50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు! ఆమెతో పాటు ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన చార్టర్డ్ అకౌంటెంట్ ఇమ్రాన్ మెమన్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు!

అసలు ఏం జరిగిందంటే?

కాంకేర్ లోని సంజయ్ పూర్ కు చెందిన మహమ్మద్ షోయబ్ రంగ్రేజ్ అనే స్క్రాప్ వ్యాపారికి చెందిన ట్రక్కును నవంబర్ 18న ఇ-వే బిల్లు తనిఖీల్లో భాగంగా జీఎస్టీ అధికారులు నిలిపివేశారు! వాహనంలో సుమారు రూ. 3 లక్షల విలువైన స్క్రాప్ ఉండగా, సరైన పత్రాలు ఉన్నప్పటికీ సుమారు రూ. 10 లక్షల వరకు భారీ జరిమానా విధిస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆంచలా గిరి బెదిరించారు!

వాహనాన్ని విడుదల చేయడానికి, కేసులో జరిమానా తగ్గించి ఉపశమనం కలిగించడానికి తొలుత రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశారు! చివరకు బేరసారాల అనంతరం రూ. 1.50 లక్షల లంచం, రూ. 50 వేల జరిమానా చెల్లించేలా ఒప్పందం కుదిరింది! ఈ డబ్బును మధ్యవర్తి, స్థానిక సంజయ్ నగర్ కు చెందిన సీఏ ఇమ్రాన్ మెమన్ (30) ద్వారా అందించాలని ఆంచలా గిరి సూచించారు!

డ్రైనేజీలో నోట్ల కట్టలు! సినీ ఫక్కీలో ఏసీబీ దాడి!

లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి షోయబ్ రంగ్రేజ్, ఆధారాలతో సహా జగదల్ పూర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు! ఫిర్యాదులోని వాస్తవాలను ధృవీకరించుకున్న రాయ్ పూర్, జగదల్ పూర్ లకు చెందిన 18 మంది సభ్యుల ఏసీబీ సంయుక్త బృందం శనివారం (నవంబర్ 21) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాంకేర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ లో ఉన్న ఆంచలా గిరి నివాసంపై వల పన్ని దాడి చేసింది!

వ్యాపారి నుండి ఇమ్రాన్ మెమన్ ద్వారా రూ. 1.50 లక్షల నగదు తీసుకున్న వెంటనే ఏసీబీ బృందం ఇంటిలోకి ప్రవేశించింది! అధికారులను గమనించి కంగారుపడిన ఆంచలా గిరి, ఇమ్రాన్ మెమన్ ఆధారాలను మాయం చేసేందుకు ఆ రూ. 1.50 లక్షల నోట్ల కట్టలను ఇంటి బయట ఉన్న డ్రైనేజీ (మురుగు కాలువ) లోకి విసిరేశారు! అయితే అప్రమత్తమైన ఏసీబీ సిబ్బంది డ్రైనేజీలో పడిన నోట్ల కట్టలను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు!


ఆదాయానికి మించిన ఆస్తులపై సోదాలు!

అరెస్టయిన ఆంచలా గిరి, ఇమ్రాన్ మెమన్ లపై అవినీతి నిరోధక చట్టం, 1988 (సవరించిన 2018) లోని సెక్షన్లు 7 మరియు 12 కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ కుమార్ మర్కమ్ వెల్లడించారు! ట్రాప్ ఆపరేషన్ అనంతరం ఆంచలా గిరి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి! ఇంట్లో లభించిన ఆస్తి పత్రాలు, ఇతర కీలక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు!


#DailyBharath #ACB #GST #Bribe #Chhattisgarh #Kanker #Corruption

Previous సిరిసిల్లలో భయానక ప్రమాదం! ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు! గడ్డపారతో తలుపులు తొలగించి డ్రైవర్ ను బయటకు తీశారు!
Next సిరిసిల్ల : లక్షలు పెట్టి కట్టిన బతుకమ్మ తెప్ప నేడు ఆట మైదానం! ప్రజల సొమ్ము వృథా!?
ADVERTISEMENT