| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ

పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ

డైలీ భారత్, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా మాజీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ గారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తనకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహిళా కాంగ్రెస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, మహిళల సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి పిడుగు మమత, నిత్య, గీత, ప్రవళిక, వనిషా , మమత, జ్యోతి ఉన్నారు.

Previous రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ
Next నవంబర్ 25 నుంచి కొత్తగూడెంలో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం
ADVERTISEMENT