| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి

వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్:

వెలుగుల ఉదయం చూడాలి...

వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టక

రేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...

ఇసుక గూళ్లు కట్టుకున్నే వయసులో

ఇటుకల తట్టలు ఇంకా ఎన్ని  రోజులు 

మోయలని..?

వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టక

రేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...

ఆకలి పేగులు మెలిపెడుతుంటే

కనుపాపలకు కునుకు ఎలా వస్తుంది అని..?

కరెంటు కోతలతో వేడెక్కిన స్టాటరులతో మోటార్లు 

చనిపోతుంటే...

నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే...

రైతన్నల చిరునవ్వుల హారాలు తెగిపోయి

కుటుంబాలకు దూరం అవుతున్నారు అని 

రేయిలో జారిన సిరాచుక్క ఆవేదన చెందుతోంది..!

రంగుల ప్రపంచంలో ప్లాస్టిక్ జీవితం ఎప్పుడు అంతం అవుతుంది అని నా కలం ఆడుగుతోంది..!

గాలికి కొట్టుకుపోయే బతుకులకు

వరదల జల్లు కాదు..

కన్నీటిని తుడిచే చినుకులు కావాలని

నా కలం కోరుకుంటోంది..!

స్టేటస్‌ల సముద్రంలో మునిగిపోయిన మనసులకు

ఆప్యాయతల అలలు తాకాలని

నా కలం కోరుకుంటోంది..!


రచన: మంజుల పత్తిపాటి 

చరవాణి 9347042218 

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.

Previous భగవాన్ దాస్ కాలనీలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ.
ADVERTISEMENT