డైలీ భారత్, నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో రాత్రి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది! చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు అదుపుతప్పి రహదారికి అవతలి వైపునకు దూసుకెళ్లి, అక్కడి నుంచి దూరంగా ఉన్న పొలాల్లో పడిపోయింది! ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం!
పేర్లు స్టార్.. ప్రయాణం మాత్రం భయం!
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పేర్లు మార్నింగ్ స్టార్, ఈవెనింగ్ స్టార్, నైట్ స్టార్ అంటూ ఆకర్షణీయంగా ఉంటున్నా.. వాటిలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం గమ్యస్థానం చేరుకునే వరకు భయమే మిగులుతోంది!
ఎక్కువగా రాత్రి వేళల్లో బయలుదేరే ఈ బస్సులు వేగంగా ప్రయాణించడం, సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందర ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది!
మరోసారి ప్రశ్నలు!
తాజాగా మనుబోలు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం మరోసారి ప్రైవేట్ బస్సుల ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది!
బస్సుల వేగ నియంత్రణ, డ్రైవర్ల విశ్రాంతి, వాహనాల ఫిట్ నెస్ పై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు!
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి ట్రావెల్స్ సంస్థ బాధ్యత! స్టార్ పేర్లు పెట్టుకోవడం కాదు.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించడమే నిజమైన సేవ!
#DailyBharath #Manubolu #Nellore #BusAccident #PrivateTravels #RoadSafety