సోషల్ మీడియాలో చూసి ఫెయిర్ నెస్ క్రీమ్ కొంది! 17 నుంచి 18 ఏళ్ల అమ్మాయి కిడ్నీలు దెబ్బతిన్నాయి!
డైలీ భారత్, మలప్పురం: ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! తెల్లగా అవ్వాలని వాడే ఆ క్రీమే మీ కిడ్నీలను దెబ్బతీస్తుంది!
కేరళలో సోషల్ మీడియాలో ప్రచారం చూసి ఫెయిర్ నెస్ క్రీమ్ కొన్న 17 నుంచి 18 ఏళ్ల బాలిక తీవ్ర కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలైంది! దీనికి కారణం ఆ క్రీమ్ లో ఉన్న అత్యధిక మెర్క్యురీ అని వైద్యులు తేల్చారు!
సోషల్ మీడియాలో చూసి కొంది!
బాలిక హయ్యర్ సెకండరీ విద్యార్థిని! సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్లు పెట్టిన వీడియోలు చూసి ఆకర్షితురాలైంది! రాత్రికి రాత్రే మొటిమలు, నల్ల మచ్చలు పోతాయని చెప్పారు!
సోషల్ మీడియాలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసింది! ఏడాది పాటు పలు బాటిళ్లు కొంది! మొదట్లో చర్మం తెల్లగా కనిపించింది! 3 నెలల క్రితం నుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది!
వైద్యుల షాకింగ్ నివేదిక! 12500 రెట్లు మెర్క్యురీ!
బాలికకు కాళ్లు, ముఖం వాపు, తీవ్ర అలసట, బీపీ పడిపోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు వచ్చాయి! మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ICU లో చేర్చారు!
పరీక్షల్లో రక్తంలో ప్రమాదకర స్థాయిలో మెర్క్యురీ ఉన్నట్లు తేలింది! ఆమెకు మెంబ్రేనస్ నెఫ్రోపతి అనే తీవ్ర కిడ్నీ వ్యాధి వచ్చింది!
ల్యాబ్ పరీక్షలో ఆ క్రీమ్ లో మెర్క్యురీ 12,500 PPM ఉన్నట్లు తేలింది! నిబంధనల ప్రకారం కాస్మెటిక్స్ లో మెర్క్యురీ 1 PPM కంటే తక్కువ ఉండాలి! అంటే అనుమతించిన దానికంటే 12,500 రెట్లు ఎక్కువ!
పోలీసు కేసు!
బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు నవంబర్ 22న కేసు నమోదు చేశారు! తయారీదారులు, విక్రేతలపై మోసం, కల్తీ కాస్మెటిక్స్ తయారీ, అమ్మకం సెక్షన్ల కింద కేసు పెట్టారు!
కేరళలో భారీ దాడులు! ఆపరేషన్ సౌందర్య!
ఈ ఘటనతో కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసింది! ఇప్పటికే 10 లక్షల రూపాయల విలువైన నకిలీ కాస్మెటిక్స్ స్వాధీనం చేసుకున్నారు! వాటిలో 20,000 PPM మెర్క్యురీ ఉన్న విదేశీ ఫెయిర్ నెస్ క్రీములు కూడా ఉన్నాయి!
హెచ్చరిక!
ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడుతున్నారా? జాగ్రత్త! సోషల్ మీడియాలో చూసిన ప్రతి క్రీమ్ ను నమ్మి కొనవద్దు! లైసెన్స్, బ్యాచ్ నెంబర్, పదార్థాల వివరాలు లేని క్రీమ్ లు వాడవద్దు! అందం కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దు!
#DailyBharath #FairnessCream #Kidney #MercuryPoisoning #Kerala #Malappuram #OperationSoundarya #BreakingNews