Posted on 2025-10-29 10:09:24
ఇది చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర!!
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్, దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ ప్రెస్ క్లబ్లో వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం, దేనికి నిదర్శనం అని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్..
డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతా ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా? ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి,,మంత్రి పదవులు ఈ దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా? ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందన్నారు. ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ అని అడిగారు? అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాల సామాజిక వర్గం పై ప్రగతించుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై తనకు ఏ విధమైన ఈర్ష ద్వేషాలు ఉన్నాయో చేసి చూపించారని, ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి.. ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోరం అన్యాయం, చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగుల రా మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరిచి బయటకు రండి మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉంది, పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయామని అన్నారు. శాంతియుత పోరాటానికి సిద్ధం గా ఉన్నామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో, గైని గంగారామ్ సక్కి ప్రభంజన్, సక్కి సంజీవ్, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి కొప్పుల ప్రేమ్ బాబు నెల్లి సూరిబాబు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >