| Daily భారత్
Logo




వేములవాడ పట్టణ వాహనదారులకు బిగ్ అలెర్ట్..ఇకపై సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్‌..

News

Posted on 2025-10-29 08:50:49

Share: Share


వేములవాడ పట్టణ వాహనదారులకు బిగ్ అలెర్ట్..ఇకపై సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్‌..

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు,వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి

వేములవాడ పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేస్తూ,వాహనాలను ఆటోమేటిక్‌గా గుర్తించే ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు

డైలీ భారత్ వేములవాడ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు,ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనాలు,వేములవాడ పట్టణానికి వచ్చే అనుమానాస్పద వాహనాలను గుర్తించేందుకు పట్టణనికి వచ్చే 05 కీలక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు.

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాను వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.....

వేములవాడ పట్టణ పరిధిలోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, ఒల్డ్ బిడ్జి, తిప్పపూర్ బస్టాండ్ కరీంనగర్ నుండి వచ్చే దారి, సిరిసిల్ల నుండి వచ్చే దారిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఈకెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల,ర్యాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాల నంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి సంబంధిత వాహనాల యజమానులకు ఈ-చాలాన్ జారీ చేయబడుతాయన్నారు.

ఈఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం,చోరీ వాహనాలను గుర్తించడం,అనుమానిత వాహనాలు గుర్తించడం,నేర పరిశోధనలో వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.పట్టణ ప్రజలు,వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం,స్పీడ్ పరిమితులలో డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవ్ చేయరాదు వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఆటోమేటిక్ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వేములవాడ పట్టణానికి చెందిన IMA వారిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వేములవాడ పట్టణానికి చెందిన ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈకార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు రామ్మోహన్,రూరల్ ఎస్.ఐ వెంకట్రాజం,ఎల్లగౌడ్, రాజు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >