Posted on 2025-10-28 17:51:55
డైలీ భారత్, కరీంనగర్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
ఈనెల 27 నుండి వచ్చే నెల రెండు వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంపొందించాలని అన్నారు. ప్రజా సేవలో పారదర్శకత, బాధ్యత చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఉద్యోగికి పనిలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 14432, లోగో కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఆర్డీవో మహేశ్వర్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >