| Daily భారత్
Logo




సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

News

Posted on 2025-10-28 15:09:42

Share: Share


సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, టికెట్ రేట్ల పెంపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు 24 ఇతర యూనియన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశానికి రేవంత్ హాజరయ్యారు.  ఈ సభలో రేవంత్ ప్రసంగించారు. "టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని!" అని స్పష్టం చేశారు.  

"సినిమా టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ, పరిశ్రమలో శ్రమిస్తున్న కార్మికులకు – లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్ వంటి వారికి ఏమీ రాదు. అందుకే, ఇకపై టికెట్ రేట్ల పెంపుకు అనుమతి (జీవో) ఇవ్వాలంటే, పెరిగిన రేట్‌లో 20 శాతం మొత్తం తప్పకుండా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి" అని  ప్రకటించారు.

హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ పేరుమీదు.. గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేశారు. . సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు. అధికారంతో నాక ళ్లు మూసుకుపోలేదు.. కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులేనని రేవంత్ అన్నారు.

ప్రభుత్వం తరపున 10 కోట్లు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది మీ హక్కు. మీరు ఎప్పుడు అవసరమైనా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు.  కృష్ణనగర్ లో సినీ కార్మికుల పిల్లల కోసం  ప్రత్యేక స్కూల్  నిర్మిస్తామన్నారు. ఇది ఆధునిక సౌకర్యాలతో, ఉచిత విద్యతో ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.  హెల్త్ ఇన్షూరెన్స్, పెన్షన్, స్కిల్ డెవలప్‌మెంట్  ఈ సమస్యలన్నింటినీ కార్మికులు తన దృష్టికి తెచ్చారని..  ఆరోగ్య కార్డులు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, పెన్షన్ స్కీమ్  ఇవన్నీ మీకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.  సినిమా పరిశ్రమలో ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు నియంత్రణ తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు.  హైదరాబాద్‌ను  హాలీవుడ్  మార్చాలంటే, ముందు కార్మికుల సంక్షేమం బలోపేతం కావాలన్నారు

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >