| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రియాజ్ పై ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు

రియాజ్ పై ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు

మీడియాకు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:సి సి ఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై నిజాంబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేశారు.కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన తెలిపారు. నిందితుడు రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడుతుండగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆయనను జిల్లా ప్రభుత్వ  హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రియాజ్ను అరెస్టు చేస్తున్న సమయంలో అసిఫ్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడుతుండగా ఆ పెనుగులాటలో ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రియాజ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Previous పండగకు స్వీట్లు కొనుగోలు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త
Next పార్వతీపురం RTC కాంప్లెక్స్ లో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు
ADVERTISEMENT