Posted on 2025-10-19 17:35:37
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.
డైలీ భారత్,పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా లో ఇవాళ(ఆదివారం) భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుంచి ఏఎన్ఎల్ పార్సిల్‌కి వచ్చిన సామన్లు దించుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా... మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి.
క్షతగ్రాతులని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇరువురిని విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, సామగ్రి మెుత్తం ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ అధికారులు, స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. బాణసంచా పేలుడా? లేక ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >