| Daily భారత్
Logo




అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

News

Posted on 2026-07-03 19:34:17

Share: Share


అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత 

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విలేకరి అపర్ణ కుటుంబాన్ని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ పరామర్శించి అండగా నిలిచినరు. అపర్ణ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ఆమె కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి రూ.10,000ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టుల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అపర్ణ జర్నలిజం రంగంలో తన సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ఈ లోటు ఎప్పటికీ తీరనిదేనని, అయితే ప్రెస్ క్లబ్ తరఫున సాధ్యమైనంత సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఆర్థిక సహాయం అందుకున్న అపర్ణ కుటుంబ సభ్యులు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం చెప్పడం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, సహచర పాత్రికేయుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, అపర్ణ కుటుంబ సభ్యులు పలువురు  పాల్గొన్నారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >