Posted on 2026-07-04 03:48:45
డైలీ భారత్, తిరుపతి: ప్రభుత్వ రుణం మంజూరు పేరుతో లంచం డిమాండ్ చేసిన తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను ఏపీ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
చేపల పెంపకం కోసం ఒక రైతుకు రూ.50 లక్షల రుణం మంజూరైంది. ఆ రుణం ఫైల్ క్లియర్ చేయడానికి డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.6 లక్షలు లంచం అడిగాడు. దీంతో బాధిత రైతు ACBకి ఫిర్యాదు చేశాడు.
ACB అధికారులు ఫిర్యాదు ధృవీకరించి ట్రాప్ ప్లాన్ చేశారు. రూ.6 లక్షల్లో మొదటి విడతగా రూ.3 లక్షలు తీసుకుంటుండగా రెడ్డయ్యను అధికారులు పట్టుకున్నారు.
అధికారిని అదుపులోకి తీసుకున్న ACB సిబ్బంది అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని తదుపరి విచారణ కోసం SPE & ACB స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు.
ప్రభుత్వ పథకాలు, రుణాలు, సబ్సిడీల పేరుతో ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 ACB టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ACB అధికారులు సూచించారు.
కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >