Posted on 2026-07-02 14:21:43
తంగళ్లపల్లి పర్మిట్ రూమ్‌లో వినియోగదారుల ఆందోళన
డైలీ భారత్, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఓ పర్మిట్ రూమ్‌లో గురువారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. మందు సేవించేందుకు వచ్చిన వినియోగదారులు మంచింగ్‌గా వేయించిన పల్లీలు ఆర్డర్ చేయగా, వాటిలో వేయించిన పురుగు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై అక్కడే ఉన్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు ముప్పులో పడుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిబంధనలు ఉల్లంఘించి అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సదరు పర్మిట్ రూమ్ యాజమాన్యంపై ఆహార భద్రత, ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >