Posted on 2026-07-03 14:58:35
డైలీ భారత్, నాతవరం: అనకాపల్లి జిల్లా నాతవరంలో జరిగిన వివాహ వేడుకలో చోటుచేసుకున్న భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఛేదించారు.
పెళ్లి మండపంలో జరిగిన ఈ స్నాచింగ్‌లో రూ.5,60,000/- నగదు చోరీకి గురైంది. బాధితులు వెంటనే అప్రమత్తమై 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన నాతవరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి చోరీకి గురైన మొత్తం రూ.5,60,000/- నగదును పూర్తిగా రికవరీ చేశారు. కేసును వేగంగా ఛేదించిన నాతవరం పోలీసులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా IPS, డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
అత్యవసర సమయంలో 112 నంబర్‌కు కాల్ చేయడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవడానికి వీలవుతుందని, ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా కోరారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >