Posted on 2025-10-19 16:13:12
గుమ,గుమ లాడే గులాబ్ జామ్ లో వెంట్రుకలు ప్రత్యక్షం
ఓ ప్రముఖ స్వీట్ హోమ్ లో వెలుగు చూసిన వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దీపావళి పండుగ పూట గుమ గుమ లాడే గులాబ్ జామ్ తినాలనుకుంటున్నారా... అయితే తస్మాత్ జాగ్రత్త.. స్వీట్లో వెంట్రుకలు ప్రత్యక్షమై కొనుగోలుదారులలో షాక్ ను గురిచేసింది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ స్వీట్ హోమ్ లోనీ గులాబ్ జామ్ లో తల వెంట్రుకలు రావడం జిల్లా కేంద్రంలో ఆదివారం కలకలం రేపింది.
నిజామాబాద్ నగరంలోని పేరు ప్రఖ్యాతలు కలిగిన స్వీట్ హోమ్ లో ఈ సంఘటన వెలుగులోకి రావడం విస్మయం కలిగించింది. దీపావళి పండుగ ను పురస్కరించుకొని మిఠాయిలు కొనుగోలు చేసిన వారికి గులాబ్ జామ్ లో వెంట్రుకలు రావడం ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్డు ప్రాంతంలో గల ఓ ప్రముఖ స్వీట్ హోమ్ లో ఓ వ్యక్తి గత శుక్రవారం గులాబ్ జామ్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి చూడగా అందులో వెంట్రుకలు ఉండడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే స్వీట్ హోమ్ కు వచ్చి వారిని నిలదీయడంతో స్వీట్ హోమ్ యజమాని కస్టమర్ ను బెదిరించి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పాడు. దీంతో కస్టమర్ గులాబ్ జామ్ లను వీడియో తీసి వెంటనే సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీతకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ స్వీట్ హోమ్ పై దాడి చేసి మిఠాయిలను పరిశీలించారు. వెంట్రుకలతో తయారుచేసిన గులాబ్ జామ్ లను స్వాధీనం చేసుకొని పోరిన్సిక్ ల్యాబ్ కు పరిశీలన కోసం పంపించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరగా గులాబ్ జామ్ లో వెంట్రుకలు వచ్చిన విషయం వాస్తవమేనని, కస్టమర్ ఫిర్యాదుతో స్వీట్ హోమ్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో గులాబ్ జామ్ ల లో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించి స్వీట్ హోమ్ యజమానికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు హానీ కలిగించే విధంగా తిను బండారాలను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >