డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో అత్యంత ఉత్సాహభరితంగా, సృజనాత్మక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభకు వేదికగా మారిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య విచ్చేసి, విద్యార్థులు రూపొందించిన 40కి పైగా వైజ్ఞానిక నమూనాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి ప్రదర్శన వెనుక ఉన్న ఆలోచన, సమస్య పరిష్కార దృక్పథాన్ని అభినందిస్తూ, గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ చూపగలరని ప్రశంసించారు.
జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విజయం సాధించిన విద్యార్థులకు అగస్త్య ఫౌండేషన్ సిరిసిల్ల జిల్లా కన్వీనర్లు బహుమతులు అందజేశారు. విద్యార్థులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది.
జిల్లా సైన్స్ అధికారి తన ప్రసంగంలో, “విద్యార్థులు పాఠశాల దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని, పరిశోధనా మనస్తత్వంతో ముందుకు సాగితేనే భవిష్యత్ భారత దేశ అభివృద్ధికి తోడ్పడగలరు” అని పేర్కొన్నారు.
పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ సెల్ఫీ పాయింట్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా A. P. J. Abdul Kalam మరియు C. V. Raman కట్‌ఔట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ శాస్త్రవేత్తల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలు పాఠశాలలో శాస్త్రస్ఫూర్తిని మరింత బలపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక రకాల కార్యక్రమాల్లో నేను బిజీగా ఉన్నప్పటికిని మరి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కృతకృతులైనటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు అగస్త్య ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు