| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పరీక్షల పట్ల భయంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఏదైనా పరీక్ష ఫెయిల్ అయిన మరొకసారి రాసుకునే అవకాశం ఉన్నదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలియజేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని విడనాడి ధైర్యంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.పరీక్షలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కళాశాల అధ్యాపకులను,తల్లిదండ్రులను సంప్రదించాలని, అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు.

Previous యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Next పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం
ADVERTISEMENT