| Daily భారత్
Logo




రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

News

Posted on 2025-10-19 15:59:44

Share: Share


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్

పరారీలో ఉన్న  హంతకున్ని 48 గంటల లోపే పట్టుకున్న పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్  కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తులు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ కేసులో రాష్ట్ర డిజిపి, డిఐజి త్వరగా ఈ కేసును చేదించాలని జిల్లా సీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో నిందితులు రియాజ్ ను ఆదివారం పట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషనరేట్​ పరిధిలోని సీసీఎస్​ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్​ ప్రమోద్​  దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్​ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్​ను శుక్రవారం (అక్టోబరు 17)న అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్​ ప్రమోద్​పై నిందితుడు రియాజ్​ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్​ పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా.. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న కమిషనరేట్​ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్​ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్​ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని నిందితుడు రియాజ్​ ఉపయోగించిన బైక్​స్థానిక కెనాల్​  సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్​లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్​  సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్​ శివారులో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం.


మరోసారి పోలీసులపై దాడికి తెగబడిన రియాజ్

పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి

ఆసుపత్రి కి తరలింపు .. తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు..?


సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. ఈ లోపు కానిస్టేబుళ్లు రియాజ్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >