| Daily భారత్
Logo




ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

News

Posted on 2026-02-28 13:20:47

Share: Share


ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.శనివారం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్, హయత్ నగర్ మండలంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు.                         

ఈ సందర్బంగా చౌక ధర దుకాణాలను, అంగన్వాడి కేంద్రాన్ని,  విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ హాస్టల్, స్కూల్,  వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ను కమిషన్ సభ్యులు ఆనంద్,  శారద, భారతి, జ్యోతిలతో కలిసి రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.  

 ఈ సందర్భంగా చైర్మన్ జాతీయ ఆహార భద్రతా చట్టం - 2013 అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళిక బద్ధంగా మెనూ ను రూపొందించిందని, దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు.  ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. లబ్దిదారులకు చట్టబద్దమైన హక్కులు అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పోషకాహారం కచ్చితంగా అందించాలని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు.  స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రిజిస్టర్లు, కేటాయింపు ఉత్తర్వులు, ఈ-పోస్ లావాదేవీలను పరిశీలించారు. లబ్దిదారులకు బియ్యం సకాలంలో అందుతున్నాయా, అక్రమాలు జరుగుతున్నాయా అనే అంశాలపై వివరాలు తీసుకున్నారు. ఐసిడిఎస్, పీఎం పోషణ పథకాల అమలు, పోషకాహార సరఫరా నాణ్యత, ప్రసూతి ప్రయోజన పథకం అమలు, ఎన్ఎఫ్ఎస్ఏ కింద అర్హ కుటుంబాల గుర్తింపు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరు, సామాజి క తనిఖీలు, విజిలెన్స్ కమిటీల పనితీరు, గోదాముల పరిస్థితి, నాణ్యత సంరక్షణ చర్యలపై చర్చించారు. నాణ్యమైన ఆహార ధాన్యాలు పార దర్శకంగా, సకాలంలో లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ప్రజల, విద్యార్థుల సమస్యలను తెలిపేందుకు పాఠశాల, చౌక ధర దుకాణాల ఆవరణలో అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన ఫిర్యాదు పట్టికను అమర్చాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీలలో పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించాలని చైర్మన్ సూచించారు.  ఎప్పటికప్పుడు రేషన్ నిల్వలను రిజిస్టర్లలో నమోదు చేయాలని అదేవిధంగా సరుకులపై గడువు తేదీని  పరిశీలించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.ఈ  కమిషన్ చైర్మన్ పర్యటనలో ఆర్డీఓలు అనంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, డిఇఓ సుసిందర్ రావు, డీఎంహెచ్ఓ లలితా దేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, జిల్లా మేనేజర్ హరీష్, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, రామేశ్వరి దేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >