| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వార్డ్ బాట పట్టిన 14వ వార్డ్ కౌన్సిలర్

వార్డ్ బాట పట్టిన 14వ వార్డ్ కౌన్సిలర్

డైలీ భారత్, కామారెడ్డి,: కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వార్డ్ బాట పట్టారు. వార్డ్ పరిధిలో విధి దీపాలు పనీ చేయని స్థానంలో కొత్తగా విధి దీపాలు ఏర్పాటు చేశారు. సొంత నిధులతో వార్డ్ పరిధిలో 20 కొత్త లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. పారిశుద్ద పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని, చెత్త బండి సక్రమంగా వచ్చి చెత్త సేకరణ చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు. వార్డ్ జవాన్, సిబ్బంది తరుచుగా మురికి కాలువలు శుభ్రం చేయాలనీ, స్ట్రీట్ లైట్స్ సక్రమంగా వచ్చేలా చూడాలని ఎలక్ట్రీక్ సిబ్బందికి సూచించారు. వార్డ్ పరిధిలో కాకతీయ నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సాయి సద్గురు కాలనీ లలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎస్ నర్సింహా చారి, శ్యామ్, మల్లికార్జున్, రమేష్ రెడ్డి, హరి నారాయణ, దేవేందర్, నందం, ఎలక్ట్రీకాల్ సిబ్బందితదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Next మాందాపూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు
ADVERTISEMENT